చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ప్రారంభించిన కార్యక్రమాల జాబితా:


🛑బి3డబ్ల్యు కార్యక్రమం : అభివృద్ధి చెందుతున్న మరియు తక్కువ ఆదాయం గల దేశాలలో మౌలిక సదుపాయాల పెట్టుబడి లోటును పరిష్కరించడానికి జి7 దేశాలు 'బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ (బి3డబ్ల్యు) కార్యక్రమాన్ని ప్రారంభించింది - ఇక్కడ చైనా కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్" ను  ప్రారంభించింది.


🛑బ్లూ డాట్ నెట్ వర్క్ : ప్రపంచ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక నాణ్యత, నమ్మకమైన ప్రమాణాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మరియు పౌర సమాజాన్ని ఒక్క తాటి పై తీసుకురావడానికి అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా లు ఏర్పాటు చేసిన బహుళ వాటాదారుల కార్యక్రమం ఇది.


🛑గ్లోబల్ గేట్ వే: యూరోపియన్ యూనియన్ ఇటీవల గ్లోబల్ గేట్ వే అనే నూతన మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది.



Source : International Relations / Online