ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యుఎన్ డబ్ల్యుజిఐసి)
అక్టోబర్, 2022 లో దీనిని భారతదేశం నిర్వహించబోతుంది. ఇది రెండవ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యుఎన్ డబ్ల్యుజిఐసి) దీని గురించి గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ అవగాహన కలిగించనున్నారు.
ఈ సదస్సు గురించి:
యునైటెడ్ నేషన్ కమిటీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ ఆన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ (యుఎన్-జిజిఐఎమ్) ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ (యుఎన్ డబ్ల్యుజిఐసి)ని నిర్వహిస్తున్నది. దీనిని సభ్య దేశాలు మరియు సంబంధిత భాగస్వాముల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ మరియు సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యాలతో నిర్వహిస్తుంది.
మొదటి యుఎన్ డబ్ల్యుజిఐసిని చైనా అక్టోబర్ 2018 లో నిర్వహించింది.
అక్టోబర్ 2022 లో రెండవ యుఎన్ డబ్ల్యుజిఐసిని భారతదేశానికి నిర్వహించే బాధ్యతను యుఎన్ జీజీఐఎం అప్పగించింది. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యం యొక్క వేడుక)"లో భాగంగా భారతదేశం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
Source : PIB/ International
0 Comments