ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో బహిరంగ చర్చ 

'సముద్ర భద్రతను పెంపొందించడం - అంతర్జాతీయ సహకారానికి వాస్తవ స్థితి' అనే అంశం పై ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు



ఈ బహిరంగ చర్చ గురించి:

  • ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చ కు అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ.

  • సముద్ర నేరాలు మరియు అభద్రతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు సముద్ర రంగంలో సమన్వయాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఈ బహిరంగ చర్చ దృష్టి సారిస్తుంది.

ముఖ్యమైన సమాచారం:

  • ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 లో 'ఈ ప్రాంతంలో అందరికీ భద్రత మరియు వృద్ధి'(‘Security and Growth for all in the Region’-SAGAR ) అనే సంక్షిప్త నామం అయిన సాగర్ దార్శనికతను తెర పైకి తెచ్చారు.

  • 2019లో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఈ చొరవను ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ (ఐపిఒఐ) ద్వారా మరింత విస్తృతం చేశారు. వీటితో పాటు సముద్ర భద్రత కు సంబంధించిన ఏడు ముఖ్యమైన అంశాల పై దృష్టి సారించారు.

  1. మారిటైమ్ ఎకాలజీ;

  2. సముద్ర వనరులు;

  3. సామర్థ్య పెంపుదల మరియు వనరుల భాగస్వామ్యం;

  4. విపత్తు యొక్క ప్రమాద తగ్గింపు మరియు నిర్వహణ;

  5. సైన్స్, టెక్నాలజీ మరియు అకడమిక్ కో ఆపరేషన్; మరియు

  6. వర్తక అనుసంధానం మరియు

  7. సముద్ర రవాణా

Source : PIB/ International