భారత భూభాగానికి తూర్పు కొనలో తెజు విమానాశ్రయంలో మొట్ట మొదటి వాణిజ్య విమానం

మొట్ట మొదటి సారిగా ఒక వాణిజ్య విమానం భారత భూభాగానికి తూర్పు కొనలో దిగింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లాలోని తెజు విమానాశ్రయం, గురువారం దేశ విమానయాన రంగంలో చరిత్రను లిఖించబడ్డది.


ఈ విమానాశ్రయం గురించి 

  1. దేశ విమానయాన చిత్ర పటంలో తెజు చేరిక ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లో పర్యాటక రంగం బాగా అభివృద్ది  చెందుతుందని అంచనా వేయబడింది.

  2. ఉడాన్ పథకం కింద ఈశాన్య ప్రాంతంలో తెజు విమానాశ్రయం ఏడవ దేశీయ గమ్యస్థానం అని, ఇది ప్రధాని నరేంద్ర మోడీ ఊహించిన విధంగా ప్రాంతీయ కనెక్టివిటీకి ఊతం ఇస్తుందని సిఎం పెమా ఖండూ అన్నారు.

  3. గౌహతి - తెజు మార్గంతో, ఉడాన్-ఆర్ సిఎస్ పథకం కింద ఈ ప్రాంతంలోని 16 మార్గాల్లో 10 మార్గాల లో ఎయిర్ కనెక్టివిటీని ఫ్లైబిగ్ సంస్థ అందించింది. ఫ్లైబిగ్ ప్రతి వారం నాలుగు విమానాల ఫ్రీక్వెన్సీతో ఈ మార్గంలో పనిచేస్తుంది.

ముఖ్యమైన సమాచారం:

ఉడాన్ పథకం గురించి

  • ఈశాన్యంలో ఆర్ సిఎస్-ఉడాన్ పథకానికి  గౌహతి-తెజు మార్గం ప్రారంభం ఒక విజయగాథ.

  • 2016 అక్టోబరులో ప్రాంతీయ నగరాల్లోని నివాసితులకు విమాన ప్రయాణాన్ని మరింతగా అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ 'ఉడే దేశ్కా ఆమ్ నాగారిక్' (యుడిఎఎన్) ప్రాంతీయ అనుసంధాన (కనెక్టివిటీ) పథకాన్ని ప్రారంభించింది.

Source : All India Radio/ Economy