సబ్ కీ యోజన సబ్ కా వికాస్
గ్రామ పంచాయితీల అభివృద్ధి ప్రణాళిక (జి.పి.డి.పి) యొక్క సమ్మిళిత మరియు సమగ్ర అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం 'సబ్ కి యోజన సబ్ కా వికాస్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ పథకం గురించి:
రాజ్యాంగంలోని 243 జీ అధికరణం ప్రకారం, ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికలను తయారు చేయడానికి మరియు అమలు చేయడానికి పంచాయితీలకు అధికారం ఇవ్వబడ్డయి.
ఈ లక్ష్యంతో, గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి) యొక్క సమ్మిళిత మరియు సమగ్ర అభివృద్ది ప్రణాళిక తయారీ కోసం 'సబ్ కి యోజన సబ్ కా వికాస్' పేరుతో ప్రజా ప్రణాళిక ప్రచార కార్యక్రమాలను 2018 మరియు 2019 లో చేసినట్లుగా 2020 అక్టోబర్ 2 నుండి జనవరి 31, 2021 వరకు ప్రారంభించబడింది.
ఈ ప్రయత్నంలో, రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ లోని జాబితాలో చేర్చబడిన, ప్రాప్తించిన 29 విషయాలకు సంబంధించిన అన్ని విభాగాలతో ఏకీకరణ కోరబడింది.
ముఖ్యమైన సమాచారం:
'సబ్ కీ యోజన సబ్ కా వికాస్' లక్ష్యాలు విస్తృతంగా ఉన్నాయి.
ఎన్నికైన ప్రతినిధులు మరియు స్వయం సహాయక బృందాల ను బలోపేతం చేయడం,
2020-21లో సాధించిన పురోగతి యొక్క ఆధారిత మదింపు ఆధారంగా 11వ షెడ్యూల్ లోని మొత్తం 29 సబ్జెక్టుల్లో 2021-22 వ సంవత్సరం కొరకు ప్రతిపాదనలు తయారుచేయడం.
పథకాలు, ఫైనాన్స్ మొదలైన వాటి గూర్చి బహిరంగంగా వెల్లడించడం.
11వ షెడ్యూల్ యొక్క మొత్తం 29 సెక్టార్ల ఫ్రంట్ లైన్ వర్కర్ లు/సూపర్ వైజర్ లతో కూడిన నిర్మాణాత్మక గ్రామసభ ద్వారా 2021-22 లో జీపీడీపీ ఆధారంగా సమ్మిళిత, భాగస్వామ్య విధానాల తయారు చేయడం.
Source:Hindu/ Schemes
0 Comments