ఈ-వేహికల్ ఫ్రెండ్లీ హైవే

కర్నాల్ లోని కర్నాల్ లేక్ రిసార్ట్ లో సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి.


ఈ-వేహికల్ ఫ్రెండ్లీ హైవే గురించి:
  1. దీనితో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ఫేమ్-1[ భారతదేశంలో వేగవంతమైన స్వీకరణ (హైబ్రిడ్) మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ] పథకం కింద భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బి.హెచ్.ఇ.ఎల్) ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల (ఎస్.ఈ.వి.సి లు) నెట్ వర్క్ తో ఢిల్లీ-చండీగఢ్ హైవే దేశంలో మొట్టమొదటి ఇ-వేహికల్ ఫ్రెండ్లీ హైవేగా మారింది.

  2. కర్నాల్ లేక్ రిసార్ట్ వద్ద ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వ్యూహాత్మకంగా ఢిల్లీ-చండీగఢ్ హైవే మధ్యలో ఉంది. మరియు ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అన్ని రకాల ఇ-కార్లకు సరిపడే చార్జింగ్ లు ఇక్కడ సిద్ధంగా ఉంది. 

  3. హైవే పై ప్రతి 25-30 కిలోమీటర్ల ఈ.వి. ఛార్జర్లను ఏర్పాటు చేయడం వల్ల ఎలక్ట్రిక్ వేహికల్ వినియోగదారుల్లో పరిధి -ఆతురత తగ్గుతుంది. మరియు ఇంటర్ సిటీ ప్రయాణానికి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.


Source : PIB/ Economy