ఈ-రూపి (e-RUPI)

 వ్యక్తి మరియు నిర్దిష్ట ప్రయోజనాల డిజిటల్ చెల్లింపు పరిష్కారం కొరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్ట్ 2వ తేదీ నాడు ఈ-రూపి (e-RUPI)ని  ప్రారంభించనున్నారు.


ఈ-రూపి గురించి:

  1. ఈ-రూపి అనేది డిజిటల్ చెల్లింపుల కొరకు నగదు రహిత మరియు కాంటాక్ట్ లెస్ ఇనుస్ట్రుమెంట్.

  2. ఇది క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎమ్ఎస్ స్ట్రింగ్ ఆధారిత ఇ-వోచర్, ఇది లబ్ధిదారుల మొబైల్ కు పంపిచబడుతుంది. 

  3. ఎటువంటి అంతరాయం లేని ఒక్కసారి చెల్లింపు చేసే యంత్రాంగం ద్వారా వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్ వద్ద కార్డు, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండా వోచర్ ని రీడీమ్ చేసుకోగలుగుతారు.

  4. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన యూపీఐ వేదికపై దీనిని అభివృద్ధి చేసింది.

  5. ఈ-రూపి సేవల యొక్క స్పాన్సర్ల లబ్ధిదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్ లతో ఎటువంటి భౌతిక సంబంధం అవసరం లేకుండా డిజిటల్ పద్ధతిలో అనుసంధానిస్తుంది.

Source : PIB / Economy