అశ్వగంధ

కోవిడ్-19 నుంచి రికవరీని ప్రోత్సహించడం కొరకు 'అశ్వగంధ'పై అధ్యయనం నిర్వహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు యూకె యొక్క లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్. ఎస్ .హెచ్. టి.ఎమ్)తో కలిసి పరిశోధన చేసింది.


అశ్వగంధ గురించి:

  1. సాధారణంగా 'ఇండియన్ వింటర్ చెర్రీ' అని పిలువబడే 'అశ్వగంధ' (వితానియా సోమ్నిఫెరా) అనేది ఒక సంప్రదాయ భారతీయ మూలిక, ఇది శక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

  2. ఆయూష్ మంత్రిత్వ శాఖ కింద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ), మరియు ఎల్ .ఎస్ .హెచ్. టి.ఎమ్ ఇటీవల మూడు యు.కె నగరాలైన - లీసెస్టర్, బర్మింగ్ హామ్ మరియు లండన్ (సౌతాల్ మరియు వెంబ్లీ) పాల్గొన్న 2,000 మందిపై 'అశ్వగంధ' యొక్క వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఒక ఎమ్ఒయు పై సంతకం చేసింది .

  3. వివిధ రుగ్మతలలో దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి 'అశ్వగంధ'పై అనేక అధ్యయనాలు జరిగినప్పటికీ, కోవిడ్-19 రోగులపై దాని సమర్థతను పరిశోధించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక విదేశీ సంస్థ సహకారంతో పనిచేయడం ఇదే మొదటిసారి.


Source : The Hindu / Health