127వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2021

127వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2021ను లోక్ సభ ఆమోదించింది. ఇది రాష్ట్రాలు  సొంతంగా ఒబిసి జాబితాలను రూపొందించడానికి గల అధికారాన్ని పునరుద్ధరించడానికి ఈ బిల్లు అవకాశం కలిపిస్తుంది.

ఈ బిల్లు గురించి:

  1. 2021 మే లో సుప్రీం కోర్టు ఉత్తర్వుల తరువాత సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన ఒబిసిలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాన్ని పునరుద్ధరించడానికి ఈ బిల్లు అవకాశం కలిపిస్తుంది.

  2. మరాఠా రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమర్థించినందున ఈ సవరణ అవసరమని కేంద్రం భావించింది.

  3. ఆర్టికల్ 342 తర్వాత ఆర్టికల్స్ 338 బి మరియు 342  ఎ (రెండు క్లాజులతో) కొత్త గా చేర్చారు. గవర్నర్లతో సంప్రదించి భారత రాష్ట్రపతి సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులను పేర్కొంటారని, అలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను తీసివేస్తారని తెలిపింది.

  4. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 105వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణనలోకి తీసుకుంటారు.

Source : The Hindu / Polity & Governance