The Financial Action Task Force’s (FATF) 

*ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ ఎటిఎఫ్) ప్లీనరీ సెషన్ తన ఐదు రోజుల చర్చను ముగించింది మరియు "వ్యూహాత్మక లోపాలు" కలిగి ఉన్న దేశాలను గుర్తించి జాబితాలో ఉంచింది.


*ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, మనీలాండరింగ్ మరియు ప్రపంచ స్థాయిలో నల్లధనం ప్రవాహం వంటి సమస్యలను చూసుకునే పారిస్ ఆధారిత ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ పాకిస్తాన్ ను "వ్యూహాత్మక లోపాలు" ఉన్న దేశాల జాబితాలో ఉంచింది. ఈ జాబితాను సాధారణంగా "బూడిద రంగు జాబితా"(grey list)లో సూచిస్తారు.

*ఎఫ్ఎటిఎఫ్ యొక్క బూడిద రంగు జాబితాలో ముఖ్యంగా మనీ లాండరింగ్ మరియు తత్ఫలితంగా అక్రమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చే విధానం ,అలాగే ఇది ఇతర దేశాలకు ఏలా ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఎఫ్ఎటిఎఫ్ తెలియజేస్తుంది. తాజాగా విడుదలైన బూడిద రంగు జాబితాలో ఫిలిప్పీన్స్, మాల్టా, దక్షిణ సూడాన్ మరియు హైతీ వంటి దేశాలు నూతనంగా చేర్చినారు.

*ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో 39 మంది సభ్యుల సమూహం సన్నిహిత సమన్వయంతో పనిచేస్తుంది. ఇది మనీలాండరింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు గల నిబద్ధత మరియు ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం (ఎఎంఎల్/సిఎఫ్ టి) చేసే దేశాలు వంటి అంశాలను ఆధారంగా ఈ మదింపు చేస్తుంది.

ముఖ్యమైన సమాచారం 

పాకిస్తాన్

*నిఘా సంస్థ తన ప్లీనరీ సమావేశాల్లో లేవనెత్తుతున్న అనేక అంశాలను(సమస్యలు) పరిష్కరించడంలో పాకిస్తాన్ పురోగతి సాధించిందని ఎఫ్ఎటిఎఫ్ పేర్కొన్నాడు. అయితే, 27 కార్యాచరణ అంశాలలో అత్యంత కీలకమైనది అమలు చేయడంలో పాకిస్తాన్ విఫలమైంది: ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉగ్రవాద సూత్రధారులపై చర్య తీసుకోవడానికి వెనకడుగు వేయడం మొదలైన అంశాలు. 


*ఎఫ్ఎటిఎఫ్ తీసుకున్న తాజా చర్య ద్వారా ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్న ఉగ్రవాద సూత్రధారులు హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ మరియు జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తో పాకిస్తాన్ కు ఉన్న  సంబంధాల కారణంగా ఆ దేశాన్ని ఒత్తిడిలో ఉంచుతుందని భావించవచు. ఎల్ఇటి మరియు జెఈఎం  అనే రెండూ గ్రూపులు భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు ముప్పు అని పేర్కొంది.

Source: All India Radio/ International