ఒబిసిల్లో ఉప వర్గాల వర్గీకరణ 

కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)ల్లో ఉప వర్గీకరణ సమస్యను పరిశీలించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీకాలాన్ని పదకొండు సారి 6 నెలలు(2021,జులై 31 నుండి 2022, జనవరి 31 వరకు) పొడిగింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


ప్రయోజనాలు:

*ప్రతిపాదిత పదవీకాలం పొడిగింపు మరియు  సూచించిన నిబంధనలలో అధనంగా వివిధ వర్గాల తో సంప్రదించిన తరువాత, ఒబిసిల ఉప వర్గీకరణ అంశంపై సమగ్ర నివేదికను సమర్పించడానికి "కమిషన్"కు వీలు కల్పిస్తుంది.

*"కమిషన్" కాలపరిమితిని 31.7.2021 కు మించి 6 నెలలు పొడిగించే ఉత్తర్వు మరియు 31.01.2022 వరకు రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫై చేయబడింది.

*అక్టోబర్ 11, 2017న బాధ్యతలు స్వీకరించిన ఈ కమిషన్ కు రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిషన్ సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ జె.కె.బజాజ్ సభ్యుడిగా మరియు మరో ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యులతో ఈ కమీషన్ ఏర్పాటు చేయబడింది.

Source : PIB

Polity & Governance