ఖావాడా వద్ద సోలార్ పార్క్ 

ఎన్.టి.పి.సి రాన్ ఆఫ్ కచ్ వద్ద భారతదేశపు ఏకైక అతిపెద్ద సోలార్ పార్కును ఏర్పాటు చేస్తుంది.



సోలార్ పార్క్ గురించి:

*ఎన్.టి.పి.సి యొక్క 100% అనుబంధం అయిన ఎన్.టి.పి.సి పునరుత్పాదక ఇంధన లిమిటెడ్, గుజరాత్ లోని ఖావాడాలోని రాన్ ఆఫ్ కచ్ వద్ద 4750 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన పార్కును  ఏర్పాటు చేయడానికి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎం.ఎన్.ఆర్.ఈ) నుండి అనుమతి లభించింది.

*దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు అయిన ఎన్.టి.పి.సి నిర్మించనున్న భారతదేశపు అతిపెద్ద సోలార్ పార్క్ ఇది.

*ఎన్.టి.పి.సి పునరుత్పాదక ఇంధన లిమిటెడ్ (ఎన్.టి.పి.సి. ఆర్ఈఎల్)కు సోలార్ పార్క్ స్కీం యొక్క మోడ్ 8 (అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్) కింద 2021 జూలై 12న ఎం.ఎన్.ఆర్.ఈ ద్వారా ముందుకు సాగడానికి మార్గం కల్పించబడింది.  ఎన్.టి.పి.సి ఆర్.ఈ.ఎల్ ఈ పార్క్ నుండి వాణిజ్య స్థాయిలో హరిత హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను కలిగి ఉంది.

*గ్రీన్ ఎనర్జీ పోర్ట్ ఫోలియో పెంపుదల్లో భాగంగా భారతదేశపు అతిపెద్ద ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అయిన ఎన్.టి.పి.సి లిమిటెడ్, 2032 నాటికి 60 గంగా వాట్ల సామర్థ్యం తో పునరుత్పాదక ఇంధన 

పార్క్ లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ముఖ్యమైన సమాచారం:

*ఇటీవల, ఎన్.టి.పి.సి ఆంధ్రప్రదేశ్ లోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్ పై 10 మెగావాట్ల (ఎసి) సామర్థ్యంతో  భారతదేశపు అతిపెద్ద నీటి పై తేలియాడే  (ఫ్లోటింగ్ ) సౌర ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకు వచ్చింది . ఆగస్టు , 2021 నాటికి అదనంగా 15 మెగావాట్ల (ఎసి) విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

*ఇంకా, తెలంగాణ లోని రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్ పై 100 మెగావాట్ల నీటి పై తెలియగానే సోలార్ ప్రాజెక్ట్  అధునాతన సాంకేతికతతో  ప్రారంభానికి అందుబాటులో ఉంది.

ఎన్.టి.పి.సి ఆర్ఈఎల్, అనుబంధం ఎన్ టిపిసి యొక్క ఆర్.ఈ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి 07.10.2020న విలీనం చేయబడింది.

Source : Times of India