రుద్రేశ్వర (రామప్ప) ఆలయం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సమీపంలోని ములుగు జిల్లా పాలంపేట్ లో రుద్రేశ్వర ఆలయం(రామప్ప ఆలయం అని కూడా పిలుస్తారు)ను భారతదేశం యొక్క నామినేషన్ ద్వారా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకి చేర్చింది. ఇది భారతదేశపు 39వ ప్రపంచ వారసత్వ ప్రదేశం.
ఆలయం గురించి:
యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రామప్ప ఆలయం, 13 వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం దాని వాస్తుశిల్పి రామప్ప పేరు మీద ఈ ఆలయం ఉంది.
కాకతీయ రాజు గణపతిదేవుని సేనాపతి అయిన రేచెర్ల రుద్రుడు క్రీ.శ 1213లో కాకతీయ సామ్రాజ్య పాలనలో రుద్రేశ్వర్ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం రామలింగేశ్వర స్వామి.
కాకతీయ శిల్పుల నైపుణ్యంను ప్రదర్శించే విలక్షణశైలి, సాంకేతిక పరిజ్ఞానం మరియు అలంకరణ తో కూడిన ఈ ఆలయ సముదాయాలు ఉన్నాయి.
ఈ ఆలయ పునాది "శాండ్ బాక్స్ టెక్నిక్"తో నిర్మించబడింది. నేల మాగిళి మొత్తం (ఫ్లోరింగ్) గ్రానైట్ మరియు స్తంభాలు బసాల్ట్ తో నిర్మించారు . ఆలయం యొక్క దిగువ భాగం ఎరుపు ఇసుకరాయి కాగా, తెల్లటి గోపురం తేలికపాటి ఇటుకలతో నిర్మించబడింది, ఇది నీటిపై తేలుతూ ఉంటుంది.
Source : The Hindu / Culture
0 Comments