Rail Cargo movement between India and Nepal
*భారతదేశం మరియు నేపాల్ మధ్య రైల్ ద్వారా సరుకు రవాణ జరపడం ద్వారా నేడు భారీ స్థాయిలో సరుకుల రవాణా రంగం ప్రోత్సాహాన్ని పొందనుంది.
*భారతదేశంలోని భారతీయ రైల్వే నెట్ వర్క్ లో సరుకును తీసుకెళ్ల గల అన్ని కేటగిరీల వ్యాగన్ల లోని కార్గోలు ఇప్పుడు నేపాల్ కు మరియు భారతదేశంలో ఏ ప్రాంతం కైనా మొత్తం సరుకును రైల్వేలు రవాణా చెయగలదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
*నేపాల్ లోని రైలు సరుకు రవాణా విభాగంలో మార్కెట్ శక్తులు రావడానికి ఈ సరళీకరణ అనుమతిస్తుంది. సమర్థత మరియు వ్యయ -పోటీతత్వాన్ని పెంచే అవకాశం ఉంది. అంతిమంగా నేపాల్ వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుస్తుంది.
*ఈ కార్గో రైలు ఆపరేటర్లలో ముఖ్యంగా పబ్లిక్ మరియు ప్రైవేట్ కంటైనర్ రైళ్లు ఆపరేటర్లు, ఆటోమొబైల్ ఫ్రైట్ రైలు ఆపరేటర్లు, ప్రత్యేక సరుకు రైలు ఆపరేటర్లు లేదా భారతీయ రైల్వేలచే అధికారం ఇవ్వబడిన ఏదైనా ఇతర ఆపరేటర్ లు ఉంటారు.
*ఈ సరళీకరణ ముఖ్యంగా ఆటోమొబైల్స్ మరియు ప్రత్యేక వ్యాగన్లలో జరిగే కొన్ని ఇతర ఉత్పత్తులకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.
*ఈ ఏడాది జూన్ 28న భారత్-నేపాల్ రైల్ సర్వీసెస్ అగ్రిమెంట్ 2004కు భారత్ మరియు నేపాల్ ఎల్.వో.ఈ లోని లెటర్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ పై సంతకాలు చేశాయి. ఇది అమల్లోకి వచ్చింది.
Source:- All India Radio
0 Comments