పంచములి సరస్సు గుజరాత్ లోని 182 మీటర్ల ఎత్తైన "స్టాచ్యూ ఆఫ్ యూనిటీ"కి సమీపంలో ఉన్న సరస్సు. డైక్-3 గా కూడా పిలువబడే ఈ సరస్సును సర్దార్ సరోవర్ ఆనకట్ట సహాయంతో పర్యాటకుల కోసం అభివృద్ధి చేయబడింది. 2019లో గుజరాత్ స్టేట్ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (జి.ఎస్.ఎఫ్.డి.సి) ఈ సరస్సుపై పర్యాటకుల కోసం పడవ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది వృక్ష మరియు జంతుజాలంతో సమృద్ధిగా ఉన్న అరణ్యాలతో చుట్టుముట్టబడింది.


ఈ సరస్సును సందర్శించే పర్యాటకుల భద్రతను నిర్ధారించడానికి గత రెండు సంవత్సరాలుగా 190 కి పైగా మొసళ్ళను స్థాన మార్పిడి చేసారు. వీటిని గాంధీనగర్, గోద్రాలోని రెండు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నా, ఇప్పటికి ఈ సరస్సులో ఇంకా ఎక్కువ మొసళ్ళు మిగిలి ఉన్నాయి.