అనాథలు (ORPHANS) గూర్చి లాన్సెట్ లో ప్రచురించిన ప్రపంచ అధ్యయన నివేదిక
లాన్సెట్ లో ప్రచురించిన ప్రపంచ అధ్యయనం ప్రకారం కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా 1.5 మిలియన్ల (15 లక్షల) మంది పిల్లలు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడిని (తమ ఇంటిలో ఒక తాత లేదా ఇతర పెద్ద బంధువు) కోల్పోయరని అంచనా వేయబడింది. వీరిలో తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయిన వారు పది లక్షల మందికి పైగా ఉన్నారు.
భారతదేశంలో ఈ అధ్యయనం యొక్క అంచనా ప్రకారం 1.19 లక్షల మంది పిల్లలు ప్రాథమిక సంరక్షకుడిని కోల్పోయారు - తల్లిదండ్రులలో ఒకరు లేదా, లేదా సంరక్షకులలో (తాత/అవ్వ) ఒకరు లేదా ఇద్దరు. వారిలో 1.16 లక్షల మంది ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా, మార్చి 1, 2020 నుంచి ఏప్రిల్ 30, 2021 వరకు, 11.34 లక్షల మంది పిల్లలు ప్రాధాన సంరక్షకుడిని (కనీసం ఒక తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో (తాత/అవ్వ)) కోల్పోయారని అధ్యయనం అంచనా వేసింది. తమ నివాసం దగ్గరలోని పెద్దవారు ( ఇతర బంధువులు పెద్దవారు) కూడా ఇందులో ఉన్నారు. మొత్తం 15.62 లక్షల మంది పిల్లలు, వీరిలో 1 మిలియన్ (10.42 లక్షలు) మంది పిల్లలు ఒకరు లేదా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు.
భారతదేశంలో మార్చి (5,091)తో పోలిస్తే ఏప్రిల్ 2021లో (43,139) కొత్తగా అనాథలుగా మారిన పిల్లల సంఖ్య 8.5 రెట్లు పెరిగినట్లు ఈ అంచనాలు స్పష్టపరుస్తున్నాయి.
ప్రాధాన సంరక్షకుడిని కోల్పోయిన పిల్లలు అత్యధికంగా మెక్సికో (1.41 లక్షలు), బ్రెజిల్ (1.30 లక్షలు)లో ఉన్నారు. తరువాతి స్థానంలో భారతదేశం ఉంది. లక్ష మందికి పైగా పిల్లలు ప్రాధన సంరక్షకుడిని కోల్పోయిన మరో దేశం యూఎస్ఏ.
Source : Indian Express/ Social Issues
0 Comments