మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎమ్.పి.ఎ.టి.జి.ఎమ్)
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ) దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ బరువు గల, ఫైర్ అండ్ పర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎమ్.పి.ఎ.టి.జి.ఎమ్)ను విజయవంతంగా పరీక్షించింది.
క్షిపణి గురించి:
అత్యాధునిక సూక్ష్మమైన (మైనియాట్యూరైజ్డ్) ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ తో పాటు అత్యాధునిక ఏవియానిక్స్ తో ఈ క్షిపణి ని రూపొందించారు.
ట్రైపాడ్ ఉపయోగించి ప్రయోగించే ఈ మ్యాన్ పోర్టబుల్ క్షిపణి ని గరిష్టంగా 2.5 కిలోమీటర్ల పరిధికి, 15 కిలోల కంటే తక్కువ ప్రయోగ బరువుతో రూపొందించారు.
కంట్రోల్ ఫ్లైట్ టెస్ట్ లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి మరియు గైడెడ్ ఫ్లైట్ టెస్ట్ లు (ఐ.ఐ.ఆర్ సీకర్ తో) ప్రణాళిక చేయబడ్డాయి.
Source : LiveMint/ Defence & Security
0 Comments