KHADI(ఖాదీ)
*ప్రపంచవ్యాప్తంగా "ఖాదీ" బ్రాండ్ గుర్తింపును రక్షించే దిశగా ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) ఇటీవల భూటాన్, యుఎఇ మరియు మెక్సికో దేశాలలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లను పొందింది. ఖాది బ్రాండ్ గుర్తింపును పొందడం ద్వారా ఖాది వస్తువుల ఎగుమతుల విషయంలో ఈ గుర్తింపు ఒక పెద్ద ముందు అడుగు.
*ఇప్పటివరకు కెవిఐసి జర్మనీ, యుకె, ఆస్ట్రేలియా, రష్యా, చైనా మరియు ఇయు అనే 6 దేశాలలో "ఖాదీ" అనే పదానికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది. ఇక్కడ కొన్ని తరగతుల్లో ఖాదీ వస్తువులకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు మంజూరు చేయబడ్డాయి.
*అయితే భూటాన్, యూఏఈ, మెక్సికోల్లో ఇటీవల ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లు నమోదు కావడంతో ఇలాంటి దేశాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
*మెక్సికో మరియు జర్మనీ వంటి దేశాలలో కొన్ని ప్రైవేట్ స్థానిక సంస్థలు తమ దేశాలలో "ఖాదీ" బ్రాండ్ పేరు కోసం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ను కోరుతున్న సందర్భాలు ఉన్నందున ఇది గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.
*ఈ దేశాలలో, ఖాదీ వస్త్రం, ఖాదీ రెడీమేడ్ వస్త్రాలు మరియు ఖాదీ సబ్బులు, ఖాదీ సౌందర్య సాధనాలు, ఖాదీ ధూపం కర్రలు వంటి గ్రామీణ పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన వివిధ వస్తువుల విభాగాల్లో కెవిఐసి రిజిస్ట్రేషన్లను పొందింది.
*ఈ దేశాలతో పాటు, కెవిఐసి యొక్క ట్రేడ్ మార్క్ దరఖాస్తులు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో యూఎస్ఎ, ఖతార్, శ్రీలంక, జపాన్, ఇటలీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, బ్రెజిల్ మరియు ఇతర దేశాలు ఉన్నాయి.
Source : LiveMint / Economy
1 Comments
Good job anna
ReplyDeleteCarrion