బాలల న్యాయ (జువెనైల్ జస్టిస్) (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు, 2021

జువెనైల్ జస్టిస్ చట్టం, 2015ను సవరిస్తూ జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) సవరణ బిల్లు 2021ని  2021 జూలై 28న రాజ్యసభలో ఆమోదించారు. ఇది 24.03.2021 న లోక్ సభలో ఆమోదించబడింది.


దత్తత

  • సివిల్ న్యాయస్థానం దత్తత ఉత్తర్వుల జారీ ద్వారా పిల్లలను దత్తత తీసుకునే తీసుకోవచ్చు అని జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 పేర్కొంది.

  • ఈ బిల్లు ద్వారా కోర్టుకు బదులుగా జిల్లా మేజిస్ట్రేట్ (అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తో సహా) దత్తత ఆదేశాలను జారీ చేస్తారు.

తీవ్రమైన నేరాలు

  • 2015 చట్టం ప్రకారం జువెనైల్స్ చేసిన నేరాలు ఘోరమైన నేరాలు, తీవ్రమైన నేరాలు మరియు చిన్న నేరాలుగా వర్గీకరించబడ్డాయి. తీవ్రమైన నేరాలలో మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉన్న నేరాలు ఉన్నాయి. 

  • ఈ నూతన చట్టం ద్వారా తీవ్రమైన నేరాలలో గరిష్టంగా శిక్ష ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష, మరియు ఇందులో కనీస శిక్ష సూచించబడ లేదు లేదా ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న నేరాలు కూడా చేర్చబడతాయి.

శిశు సంక్షేమ కమిటీలు (సీడబ్ల్యూసీ లు)

  • పిల్లలకు అవసరమైన సంరక్షణ మరియు రక్షణను అందించడానికి రాష్ట్రాలు ప్రతి జిల్లాకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిడబ్ల్యుసిలను ఏర్పాటు చేయాలని ఈ చట్టం తెలియజేస్తూంది. ఈ చట్టం సిడబ్ల్యుసికి సభ్యుల నియామకానికి సంబంధించిన కొన్ని ప్రమాణాలను సూచిస్తుంది. 

సీడబ్ల్యూసీ లో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు అని తెలియజేయడానికి ఈ బిల్లు కొన్ని ప్రమాణాలను సూచించారు. వీటిలో 

  1. మానవ హక్కులు లేదా బాలల హక్కుల ఉల్లంఘన కు సంబంధించిన ఏదైనా రికార్డును కలిగి ఉండటం, లేదా 

  2. ఏదైనా ఒక జిల్లాలో బాలల సంరక్షణ సంస్థ నిర్వహణలో భాగమై ఉండటం.


Source : PIB /Social Issues