భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్
ఎన్.టి.పి.సి యొక్క 100% అనుబంధ సంస్థ అయిన ఆర్.ఈ.ఎల్, దేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ మరియు లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎల్ ఎహెచ్ డిసి)తో అర్.ఇ.ఎల్ అవగాహనా ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకం చేసింది.
ఈ ప్రాజెక్టు గురించి:
*సౌర చెట్లు(solar trees) మరియు సోలార్ కార్ పోర్ట్(solar carport) రూపంలో లేహ్ లో ఎన్.టి.పి.సి యొక్క మొదటి సోలార్ ఇన్ స్టలేషన్ లను ప్రారంభించినప్పుడు కూడా ఈ ఎమ్ఒయు పై సంతకం చేయబడింది.
*పునరుత్పాదక వనరులు మరియు హరిత హైడ్రోజన్ ఆధారంగా కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి లడఖ్ కు సహాయపడటానికి ఈ ఎంఒయు ఎన్.టి.పి.సి కి వీలు కల్పిస్తుంది. ఇది లడఖ్ 'కార్బన్ న్యూట్రల్'గా ఉంచడం ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది.
Source : PIB/ Economy
0 Comments