సిక్కిం వృక్షజాలం

భారతదేశంలో 1% కంటే తక్కువ భూభాగం ఉన్న అతి చిన్న రాష్ట్రం సిక్కిం. దేశంలో కనిపించే అన్ని పుష్పించే మొక్కలలో 27% మొక్కలకు సిక్కిం ఆవాసంగా ఉన్నట్టు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బిఎస్ఐ) ఇటీవల  వెల్లడించింది.


* " ఫ్లోరా ఆఫ్ సిక్కిం - ఎ పిక్టోరియల్ గైడ్"అనే పేరుతో ఉన్న పుస్తకంలో  ఈ చిన్న హిమాలయ రాష్ట్రంలో సహజంగా ఏర్పడే 4,912 పుష్పించే మొక్కల జాబితాను బిఎస్ఐ 2021 జూలై మొదటి వారంంలో విడుదల చేసింది.


*దేశంలోని పుష్పించే  4,912 జాతుల  మొక్కలలో సహజంగా ఏర్పడే మరియు పుష్పించే మొక్కల మొత్తం సంఖ్య సుమారు 18,004 జాతులు. సిక్కింలో పుష్పించే మొక్కలలోని వైవిధ్యం రాష్ట్రంలో 7,096 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది.



*కంచెనగంగా బయోస్పియర్ రిజర్వ్ భూభాగంలో భాగంగా ఉన్న ఈ రాష్ట్రం విభిన్న పర్వత ప్రాంత పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ వాతావరణం మూలికలు మరియు చెట్లు పెరగడానికి మరియు వృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది.


*ఈ పుస్తక ప్రచురణ లో 532 జాతుల అడవి ఆర్కిడ్లు పుష్పాలు (ఇది భారతదేశంలో కనిపించే అన్ని ఆర్కిడ్ జాతులలో 40% కంటే ఎక్కువ), 36 జాతుల రోడోడెండ్రాన్ మరియు 20 జాతుల ఓక్, మరియు 30 కంటే ఎక్కువ జాతుల అధిక విలువ కలిగిన ఔషధ మొక్కలు, ఇతర జాతులతో పాటు పేర్కొన్నారు. 


ముఖ్యమైన సమాచారం:- 

సిక్కిం అటవీ వృక్షం (అమిటీ అండ్ రివెరెన్స్) నియమాలు, 2017

ఈ నోటిఫికేషన్ ఇలా చెబుతో౦ది, "మిత్/మిట్ లేదా మిటినీ సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన ప్రయివేట్ భూమిలో లేదా ఏదైనా ప్రభుత్వ భూమిలో నిలబడి ఉన్న చెట్లతో సహవసించడానికి రాష్ట్ర ప్రభుత్వ౦ అనుమతించవచ్చు."

"చెట్టును దత్తత తీసుకున్న చెట్టు అని పిలిచే అతని లేదా ఆమె సొంత  బిడ్డలా" ఒక చెట్టును దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ప్రజలను ప్రోత్సహించింది.


Source : The Hindu/ Environment