ట్యాప్ నుంచి డ్రింకింగ్ వాటర్ అందించే భారతదేశపు మొదటి నగరం

24 గంటల ప్రాతిపదికన కుళాయి నుండి నేరుగా స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలు పొందే నగరాలలో భారతదేశంలో పూరీ మొదటి నగరంగా అవతరించింది . ఇకపై, ప్రజలు త్రాగునీటిని నిల్వ చేయాల్సిన లేదా శుద్ది చేయాల్సిన అవసరం లేదు.


ట్యాప్ నుంచి డ్రింక్ గురించి :

  1. భారతదేశంలోని ఏ మెట్రోపాలిటన్ నగరానికి ఇంకా ఇలాంటి సదుపాయం లేదు. లండన్, న్యూయార్క్ మరియు సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి నగరాల్లో మాత్రమే ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

  2. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం పూరీలోని 2.5 లక్షల మంది పౌరులుకు మరియు పర్యాటక స్థలాలిన్ని సందర్శించే 2 కోట్ల మంది పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పర్యాటకులు వాటర్ బాటిల్ తో తిరగాల్సిన అవసరం లేదు. పూరీ పై ఇక 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల భారం ఉండదు. పూరీలోని 400 ప్రాంతాల్లో వాటర్ ఫౌంటెన్లను అభివృద్ధి చేశారు.

  3. ఒడిశాలోని మరో 10 ఇతర పట్టణ కేంద్రాల్లో ఇలాంటి ప్రాజెక్టు అమలు వివిధ దశల్లో ఉంది.


Source : The Hindu /  Health