డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్, 2021

కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ) ప్రజా సంప్రదింపుల కోసం నవీకరించబడిన - "ది డ్రోన్ రూల్స్, 2021" ను విడుదల చేసింది. డ్రోన్ రూల్స్, 2021 యు.ఎ.ఎస్ నిబంధనలు 2021 (12 మార్చి 2021న విడుదల చేయబడింది) స్థానంలో ఈ నూతన నిబంధనలు అమలులో  ఉంటుంది.


డ్రాఫ్ట్ డ్రోన్ రూల్స్, 2021 నుంచి కీలకంగా తొలగించిన వాటిలో ఇవి ఉంటాయి:

  • అనుమతులు రద్దు చేయబడ్డవి: ప్రత్యేక ఆథరైజేషన్ నెంబరు, ప్రత్యేక ప్రోటోటైప్ గుర్తింపు నెంబరు, కన్ ఫార్మన్స్ సర్టిఫికేట్, మెయింటెనెన్స్ సర్టిఫికేట్, ఇంపోర్ట్ క్లియరెన్స్ మొదలైనవి.

  • ఫారాల సంఖ్య 25 నుంచి 6కు తగ్గించబడింది.

  •  ఫీజు నామమాత్ర స్థాయికి తగ్గించబడింది. డ్రోన్ పరిమాణంతో సంబంధం లేదు.

  •   'నో పర్మిషన్ - నో టేకాఫ్' (ఎన్ పిఎన్ టి), రియల్ టైమ్ ట్రాకింగ్ బీకాన్, జియో ఫెన్సింగ్ మొదలైన భద్రతా ఫీచర్లు మొదలైనవి భవిష్యత్తులో నోటిఫై చేయాల్సి ఉంది. అనుమతి కొరకు ఆరు నెలల గడువు సమయం అందించబడుతుంది.

  • డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారా వ్యాపారాన్ని - స్నేహ పూర్వక ఏకగవాక్ష  విధానం ద్వారా అంతర్జాతీయ వ్యవస్థ గా అభివృద్ధి చేయాలి.

  •  ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు జోన్ లతో ఇంటరాక్టివ్ ఎయిర్ స్పేస్ మ్యాప్ లు డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారంపై ప్రదర్శించబడతాయి. విమానాశ్రయ చుట్టుకొలత నుండి పసుపు జోన్ ను 45 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్లకు తగ్గించారు.

  • గ్రీన్ జోన్ ల్లో 400 అడుగుల వరకు మరియు విమానాశ్రయం చుట్టు పక్కల నుంచి 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో 200 అడుగుల వరకు విమాన అనుమతి అవసరం లేదు.


  • మైక్రో డ్రోన్లు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్ మరియు ఆర్ అండ్ డి సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదు.

  • భారతదేశంలో నమోదైన విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలపై ఎలాంటి పరిమితి లేదు.

  • డ్రోన్ రూల్స్, 2021 ప్రకారం డ్రోన్ల భరువు 300 కిలోల నుంచి 500 కిలోలకు పెరిగింది. ఇది డ్రోన్ టాక్సీలను కూడా వర్తింప చేస్తుంది.

  • డ్రోన్ రూల్స్ 2021 కింద గరిష్ట జరిమానా రూ. 1 లక్షకు తగ్గించబడింది. అయితే, ఇతర చట్టాలను ఉల్లంఘించడానికి సంబంధించి జరిమానాలకు ఇది వర్తించదు.

  • కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లను అభివృద్ధి చేస్తారు.

  • వ్యాపార సులభతరం కోసం -స్నేహపూర్వక నియంత్రణను చేపట్టడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి

Source : The Hindu / Science & Tech