ధోలవీర

హరప్పా కాలం నాటి పురావస్తు స్థలమైన ధోలావిరా నగరం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క ట్యాగ్ ను అందుకుంది.


ధోలవీర గురించి:

  • ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రం నుండి ధోలావిరా నాల్గవ ప్రదేశం కాగా మరియు భారతదేశం నుండి 40 వ ప్రదేశంగా ఉంది. ఇది భారతదేశంలోని పురాతన సింధు లోయ నాగరికత (ఐవీసీ) ట్యాగ్ పొందిన మొదటి ప్రదేశం.

  • సింధు లోయ నాగరికత యొక్క కొండ మీద నిర్మించిన కోట (అక్రోపోలిస్) కచ్ జిల్లాలోని ప్రస్తుత ధోలావిరా గ్రామానికి సమీపంలో ఉన్న కొండమీద ఉంది. దీని నుండి ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. 

విభిన్న లక్షణాలు 

  1. మొహెన్-జో-దారో, పాకిస్తాన్ లోని గన్వేరివాలా మరియు హరప్పా, భారతదేశంలో హర్యానాలోని రాఖీగర్హి తరువాత, ధోలావిరా సింధు లోయ నాగరికత యొక్క ఐదవ అతిపెద్ద మహానగరం.

  2. ఈ ప్రదేశంలో ముఖ్యంగా ఒక దుర్గమైన కోట, మధ్య లో ఉన్న పట్టణం మరియు దిగువన వున్న పట్టణంలో అనేక ఇతర హరప్పా ప్రదేశాలలో మట్టి ఇటుకలకు బదులుగా ఇసుకరాయి లేదా సున్నపురాయితో చేసిన గోడలతో నిర్మించి ఉన్నాయి.

  3. ధోలవీరా ప్రదేశం యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు-  నీటి జలాశయాలు, బాహ్య రక్షణ కోటలు, రెండు బహుళ-ప్రయోజన మైదానాలు - వీటిలో ఒకటి ఉత్సవాలకు మరియు రెండవది మార్కెట్ స్థలంగా ఉపయోగించబడింది. ప్రత్యేక డిజైన్లతో తొమ్మిది గేట్లు, మరియు సమాధి దిబ్బల ను కలిగి ఉన్న అంత్యక్రియల నిర్మాణం - బౌద్ధ స్థూపాల వంటి అర్థ గోలాకారపు నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి.  

  4. ఇతర సింధు లోయ నాగరికత ప్రదేశాలలో సమాధుల మాదిరిగా కాకుండా, ధోలావిరా వద్ద మానవుల మర్త్య అవశేషాలు కనుగొనబడలేదు.

  5. ఒక రాగి యొక్క లోహ శుద్ది కర్మాగారం యొక్క అవశేషాలు ధోలావిరాలో ఉన్నాయి.  ఇక్కడ నివసించిన హరప్పన్లకు లోహ సంగ్రహణ శాస్త్రం (మెటలర్జీ) తెలుసు. 

Source : Indian Express / Culture