చిలహతి-హల్దీబరి మార్గం

బంగ్లాదేశ్ మరియు భారతదేశం మధ్య పునరుద్ధరించబడిన చిలాహతి-హల్దిబరి మార్గంలో మొదటి గూడ్స్ రైలు జూలై 31 న భారతదేశంలోని అలిపుర్దూర్ విభాగం నుండి బంగ్లాదేశ్ కు బయలుదేరనుంది.


ఈ రైలు మార్గం గురించి:

  1. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన వర్చువల్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా 55 ఏళ్ల విరామం తర్వాత గూడ్స్ రైలు నడపటం కోసం గత ఏడాది డిసెంబర్ లో హల్దీబరి-చిలాహతి రైలు మార్గాన్ని ప్రారంభించారు.

  2. ప్యాసింజర్ రైలు కూడా అదే మార్గంలో నడుస్తుంది. 1965 లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఈ మార్గం మూసివేయబడింది. అయితే, భారతదేశం మరియు బంగ్లాదేశ్ లలో కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  3. ప్రస్తుతం, ఐదు రైలు మార్గాలు బంగ్లాదేశ్ మరియు భారతదేశం లను కలుపుతాయి. అవి పెట్రాపోల్-బెనాపోల్, గేడే-దర్శన, సింఘాబాద్-రోహన్ పూర్, రధికాపూర్-బిరోల్ మరియు హల్దిబరి-చిలాహతి.


Source : All India Radio/ International