బ్రయుమ్ భారతియెన్సిస్
2017లో అంటార్కిటిక అన్వేషణ లో ఉన్నపుడు భారతదేశానికి చెందిన ధ్రువ జీవశాస్త్రవేత్తల బృందం ఒక వృక్ష జాతుల సమూహం వద్ద తడబడారు. అయితే, ఈ మొక్క జాతులు మొదటిసారిగా కనుగొనబడ్డాయని శాస్త్రవేత్తలు ఇటీవలనే ధృవీకరించగలిగారు.
*పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అరుదైన, ముదురు ఆకుపచ్చ మొక్క జాతులను కనుగొన్నారు. ప్రపంచంలోని మారుమూల పరిశోధనా కేంద్రాలలో ఒకటైన భారతి సమీపంలో దక్షిణ మహాసముద్రానికి ఎదురుగా ఉన్న లార్సెమాన్ హిల్స్ వద్ద ఈ వృక్ష జాతులు కనుగొనబడ్డాయి.తరువాత వృక్ష జాతులను నాచులుగా గుర్తించారు.
*అంటార్కిటికాలో భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ నూతన వృక్ష జాతులను శాస్త్రవేత్తలు బ్రయం భారతియెన్సిస్ గా నామకరణం చేశారు. కొత్తగా కనుగొన్న నాచు జాతికి హిందూ దేవత భారతి పేరు పెట్టారు. అంటార్కిటికాలోని భారతదేశ పరిశోధనా కేంద్రానికి కూడా భారతి అనే పేరు ఉంది.
*నాలుగు దశాబ్దాల క్రితం అంటార్కిటికాలో మొదటి పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన తరువాత, భారతదేశం ఒక కొత్త వృక్ష జాతులను కనుగొనడం ఇదే మొదటిసారి.
Source : All India Radio
Science & Tech
0 Comments