బిపైరాజోల్ ఆర్గానిక్ క్రిస్టల్స్

యాంత్రిక నష్టాలకు(రిపేర్ల ను)  స్వీయ మరమ్మత్తు చేసుకునే పదార్థాలను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


నేపథ్యం:

  • యాంత్రిక నష్టం కారణంగా మనం ప్రతిరోజూ ఉపయోగించే పరికరాలు తరచుగా మరమ్మతులకు గురి అవుతాయి. వాటిని మరమ్మత్తులు చేయడానికి లేదా  తిరిగి కొత్త వాటిని తిరిగి భర్తీ చేయడానికి యజమాన్యం ను  బలోపేతం చేస్తాయి.

  • ఇది పరికరం యొక్క జీవిత కాలం తగ్గిస్తుంది. మరియు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. చాలా సందర్భాల్లో, అంతరిక్ష నౌకల వలె, వీటి పునరుద్ధరణ కోసం మానవ జోక్యం సాధ్యం కాదు.

పిజోఎలక్ట్రిక్ స్ఫటికాలు

  • అటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కొల్ కత్తాకి చెందిన పరిశోధకులు, ఐఐటి ఖరగ్ పూర్ తో కలిసి, బయటి నుంచి ఎటువంటి బాహ్య జోక్యం అవసరం లేకుండా యాంత్రిక నష్టాల నుండి తమను తాము మరమ్మత్తు చేసుకునే పైజోఎలక్ట్రిక్ మాలిక్యులర్ క్రిస్టల్స్ ను అభివృద్ధి చేశారు.

  • పిజోఎలక్ట్రిక్ స్ఫటికాలు యాంత్రిక ప్రభావానికి గురైనప్పుడు విద్యుత్తును ఉత్పత్తి చేసే పదార్థాల తరగతికి చెందుతుంది.

బిపైరాజోల్ సేంద్రియ స్ఫటికాలు

  1. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బైపైరాజోల్ ఆర్గానిక్ స్ఫటికాలు అని పిలువబడే పీజోఎలక్ట్రిక్ అణువులు ఎటువంటి బాహ్య జోక్యం అవసరం లేకుండా యాంత్రిక పగుళ్లు ఏర్పడినా వాటికి అవే తిరిగి ఒకటిగా కలుస్తాయి. స్ఫటికాకార ఖచ్చితత్వంతో మిల్లీసెకన్ల కాలంలో స్వయం ప్రతిపత్తితో తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.

  1. ఈ అణు ఘనపదార్థాలలో, యాంత్రిక ప్రభావం పై విద్యుదావేశం ఉత్పత్తి చేసే ప్రత్యేక లక్షణం కారణంగా, విరిగిన ముక్కలు పగుళ్లు ఏర్పడిన చోటు విద్యుత్ ఛార్జీలను పొందుతాయి. ఇది దెబ్బతిన్న భాగాలు మరియు ఖచ్చితమైన స్వయం ప్రతిపత్తి మరమ్మత్తు ద్వారా పూర్వ స్థితి ఆకర్షణకు దారితీస్తుంది.


Source : PIB / Science & Tech