భూటన్ లో భీమ్-యు.పి.ఐ

భారత కేంద్ర ఆర్థిక మంత్రి మరియు భూటాన్ ఆర్థిక మంత్రి శ్రీ లియాంపో నామ్గే షెరింగ్ తో కలిసి భూటాన్ లో భీమ్-యుపిఐ (BHIM-UPI)ని సంయుక్తంగా ఢిల్లీ లో రిమోట్ ద్వారా ప్రారంభించారు.


భీమ్-యు.పి.ఐ గురించి :

*ఈ ప్రయోగం 2019 లో భూటాన్ లో భారత ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాలు కలిసి సంయుక్తంగా చేసిన నాటి ప్రకటన యొక్క నిబద్ధతను ఈ పరిణామం నెరవేరుస్తుంది.

*ఆ పర్యటన తరువాత, భారతదేశం మరియు భూటాన్ ఇప్పటికే రెండు దశల్లో  రుపే కార్డులను ఆమోదించి వినియోగంచడంలో  పరస్పర కార్యకలాపాలను ప్రారంభించాయి - మొదటి దశలో భూటాన్ ఆధారిత టెర్మినల్స్ వద్ద భారతదేశంలో జారీ చేసిన రూపే కార్డులను ఆమోదించడం, మరియు రెండవ దశలో భూటాన్ జారీ చేసిన రూపే కార్డులను భారత దేశంలో ఆమోదించడం.


*భూటాన్ లో భీమ్-యుపిఐ ప్రారంభంతో, రెండు దేశాల మౌలిక సదుపాయాలకు అంతరాయం లేకుండా చెల్లింపులు వ్యవస్థ  అనుసంధానించబడ్డాయి మరియు ప్రతి సంవత్సరం భారతదేశం నుండి భూటాన్ కు పెద్ద సంఖ్యలో ప్రయాణించే పర్యాటకులు మరియు వ్యాపారవేత్తలకు ఈ భీమ్-యు.పి.ఐ ప్రయోజనం చేకూరుస్తాయి.

*భూటాన్ తన క్యూఆర్ కోడ్ వాడకం కోసం యు.పి.ఐ ప్రమాణాలను స్వీకరించిన మొదటి దేశం. భీమ్ యాప్ ద్వారా మొబైల్ ఆధారిత చెల్లింపులను అంగీకరించిన మన తక్షణ పొరుగున ఉన్న మొదటి దేశం.

Source: All India Radio