*భారతదేశ వ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి భారత్ నెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్  వెహికిల్ ను ఏర్పాటు చేసి భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బిబిఎన్ ఎల్) ద్వారా దీనిని అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశంలో టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్, ఈ-హెల్త్ మొదలైన ప్రాథమిక డిజిటల్ సేవలను అందించడానికి ఇది ప్రయత్నిస్తుంది.

*16 రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సవరించిన అమలుకు సంబంధించిన వ్యూహానికి  కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లోని గ్రామ పంచాయితీలకు ఆవల ఉన్న అన్ని నివాసిత గ్రామాలకు దీనిని విస్తరించనునారు.