భాలియా గోధుమ
భౌగోళిక గుర్తింపు (జిఐ) పొందిన భాలియా గోధుమ మరియు వివిధ రకాల గోధుమల యొక్క మొదటి షిప్ మెంట్ నేడు(2021,జులై 8) గుజరాత్ నుండి కెన్యా మరియు శ్రీలంకకు ఎగుమతి చేయబడింది. ఈ ఎగుమతుల ద్వారా గోధుమల ఎగుమతులకు ప్రధాన ప్రోత్సాహకరంగా ఉంటుంది.
భౌగోళిక గుర్తింపు పొందిన ఈ గోధుమ అధిక ప్రోటీన్ కంటెంట్ మరియు రుచిలో తీయగా ఉంటుంది. గుజరాత్ లోని భాల్ ప్రాంతంలో ఈ పంట ఎక్కువగా పండించబడుతుంది. ఈ ప్రాంత పరిధిలో అహ్మదాబాద్ ఆనంద్, ఖేడా, భావనాగర్, సురేంద్రనగర్, భరూచ్ జిల్లాలు ఉన్నాయి.
ఈ గోధుమ రకం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, వర్షం పై ఆధారపడి పండించబడుతుంది. గుజరాత్ లోని సుమారు రెండు లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో ఈ పంట సాగు చేయబడుతుంది.
భాలియా రకం గోధుమలు జూలై, 2011లో భౌగోళిక గుర్తింపు (జిఐ సర్టిఫికేషన్) పొందింది. జిఐ సర్టిఫికేషన్ యొక్క రిజిస్టర్డ్ ప్రొప్రైటర్ ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, గుజరాత్.
Source:PIB
0 Comments