అమెజాన్ అడవులు

ప్రపంచంలోఅతిపెద్ద ఉష్ణమండల అడవులుగా ఉన్న దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులు కార్బన్ ఉద్గారాలను శోషించడానికి బదులుగా కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2)ను విడుదల చేయడం ప్రారంభించాయి.


*తూర్పు మరియు ఆగ్నేయ బ్రెజిల్ లో అధిక మొత్తంలో అటవీ నిర్మూలనకు గురికావడం ద్వారా అమెజాన్ అడవిని కార్బన్ డై ఆక్సైడ్ యొక్క ముఖ్యమైన వనరుగా మార్చింది. ఇది భూ గ్రహాన్ని వేడెక్కించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

*అమెజాన్ వర్షారణ్యాలు మాత్రమే కాకుండా, ఆగ్నేయాసియాలోని కొన్ని అడవులలో తోటలు పండించడం మరియు మంటల కు ఆహుతి కావడం వలన గత కొన్ని సంవత్సరాలుగా ఈ అడవులు కార్బన్ ముఖ్యమైన వనరులుగా మారాయి.


అమెజాన్ బేసిన్

*అమెజాన్ బేసిన్ 6 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది భారతదేశం కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంది.

*అమెజాన్ వర్షారణ్యాలు వలన బేసిన్ లో 80 శాతం నీరు పూర్తిగా నిండుతాయి.  నాసా యొక్క భూ పరిశీలన ఉపగ్రహం ప్రకారం,  ప్రపంచంలో భూమి మీద ఉన్న మొక్కల జాతులలో దాదాపు ఐదవ వంతు మొక్కలకు ఈ అమెజాన్ బేసిన్ నిలయంగా ఉన్నాయి. వందలాది దేశీయ సమూహాలు మరియు అనేక ఒంటరి తెగలతో సహా సుమారు 30 మిలియన్ల మందికి కూడా అమెజాన్ బేసిన్ ఆవాసంగా ఉంది.


*ఇది కాకుండా, ప్రపంచంలోని మంచినీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం అమెజాన్ బేసిన్ నుంచి సముద్రాలలోకి వెళ్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అటవీ నిర్మూలన మరియు అడవికి నిపుప పెట్టుట కారణంగా అడవి ప్రమాదంలో ఉంది. 2019లో అమెజాన్ బేసిన్ లోని మంటలు అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపించాయి.

Source : Indian Express / Environment