ఆమాఘర్ కోట
జైపూర్ లోని అమాఘర్ ఫోర్ట్ గిరిజన మీనా కమ్యూనిటీ మరియు స్థానిక హిందూ సమూహాల మధ్య ఘర్షణలకు కేంద్రంగా ఉంది.
ఈ కోట గురించి:
అమాఘర్ ఫోర్ట్ జైపూర్ లో రాజ్ పుత్ పాలనకు ముందు మీనా పాలకుడు నిర్మించాడని, శతాబ్దాలుగా వారి పవిత్ర ప్రదేశంగా ఉందని మీనా సంఘం సభ్యులు చెబుతున్నారు.
ఈ సంఘానికి చెందిన ప్రజలు ఈ కోటలోని అంబా మాతా మరియు ఇతర దేవతలను ఆరాధిస్తారు.
2021 జూన్ నెల లో ఇక్కడ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి మరియు కోట వద్ద కాషాయపు జెండాను ఎగురవేసిన వార్తల తరువాత, మీనా కమ్యూనిటీ సభ్యులు హిందూ సమూహాలు గిరిజన చిహ్నాలను హిందుత్వ విధానంలోకి మార్చి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అంబా మాతా పేరును అంబికా భవానీగా మార్చారని ఆరోపించారు.
ముఖ్యమైన సమాచారం:
ఈ కోట చరిత్ర
అమాఘర్ కోట యొక్క ప్రస్తుత రూపాన్ని 18 వ శతాబ్దంలో జైపూర్ వ్యవస్థాపకుడు మహారాజా సవాయ్ జై సింగ్ 2 నిర్మించారు. జై సింగ్-2 ఈ కోట ను నిర్మించడానికి ముందే ఈ ప్రదేశంలో కొంత నిర్మాణం అప్పటికే జరిగిందని ఎల్లప్పుడూ నమ్ముతారు.
Source : Indian Express / Culture
0 Comments