ఆదర్శ్ స్మారక్
వై-ఫై, ఫలహరశాల (కెఫెటేరియా), వ్యాఖ్యయన కేంద్ర (ఇంటర్ ప్రెటేషన్ సెంటర్), బ్రెయిలీ సంకేతాలు ముద్రించడం, ప్రకాశవంతమైన వెలుతురు మొదలైన అదనపు సదుపాయాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మూడు పురాతన కట్టడాలను "ఆదర్శ్ స్మరాక్" పథకం కింద గుర్తించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి రాజ్యసభకు తెలియజేశారు.
ఆదర్శ్ స్మారక్ గురించి:
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ఈ మూడు స్మారక చిహ్నాలుగా గుర్తించారు
నాగార్జునకొండ, గుంటూరు జిల్లా వద్ద ఉన్న పురాతన కట్టడాలు,
సాలిహుండ లోని బుద్ధిని అవశేషాలు శ్రీకాకుళం జిల్లా, మరియు
లేపక్షి వద్దనున్న వీరభద్ర ఆలయం
ఇంకా, గండి కోట వద్దనున్న కోటను పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అడాప్ట్-ఎ- హెరిటేజ్ కింద చేర్చారు. అయితే ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ద్వారా అభివృద్ది చేయనున్నారు.
Source : PIB/ Culture
0 Comments