టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రోజే ఇండియా పతకాల బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ గెలిచింది.
కరణం మల్లీశ్వరి తర్వాత బరువులు ఎత్తడంలో భారత్‌కు పతకం అందించింది మీరాభాయి చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకంను శిఖరాగ్రాలకు చేర్చింది.
స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోలు ఎత్తింది.
సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వర్‌తో మెరిసింది.
చైనా వెయిట్‌లిఫ్టర్ హౌ ఝిఝి 210 కేజీలతో గోల్డ్ మెడల్ గెలిచింది.
ఇండోనేషియాకు బ్రాంజ్ మెడల్ దక్కింది.
గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివరి ప్రయత్నంలో 117 కేజీల బరువు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమైంది.
Source:e News /Sports
0 Comments