ఆర్.బి.ఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2021
ఆర్ .బి.ఐ ఇటీవల ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, జూలై 2021ను విడుదల చేసింది.
ఇది ఆర్థిక స్థిరత్వం మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతకు కలిగిన ఇబ్బందులను ప్రతిబింబించే ద్వైవార్షిక నివేదిక.
ఈ నివేదిక యొక్క కీలక ముఖ్యాంశాలు
*బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్ పిఎలు) నిష్పత్తి మార్చి 2021 లో 7.48 % నుండి మార్చి 2022 నాటికి 9.8 % కు పెరగవచ్చు.
*ఎమ్.ఎస్.ఎమ్.ఇ లు తమ చెల్లింపు బాధ్యతలను నెరవెర్చడంలో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
2021 మార్చి చివరినాటికి ఎమ్.ఎస్.ఎమ్.ఇ రంగంలో రూ.25 కోట్ల కంటే తక్కువగా ఉన్న రుణాల్లో 15.9% మొండి బకాయిలు గా మారాయి.
*షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్ .సి.బిలు) యొక్క సిఆర్ఎఆర్ మార్చి 2021 లో 16.03 శాతానికి పెరిగింది.
*ఇది ప్రమాదకర భారిత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులకు సంబంధించి బ్యాంకు మూలధనం యొక్క నిష్పత్తి.
*ప్రొవిజన్ కవరేజీ రేషియో మార్చి 2021 నాటికి 68.86%గా ఉంది.
*అధిక పిసిఆర్ నిష్పత్తి అంటే అధిక ఆస్తిల యొక్క నాణ్యత సమస్యల పై శ్రద్ధ వహించబడ్డాయి మరియు బ్యాంకులకు ప్రమాదకరం కాదు.
*కోవిడ్-19 యొక్క రెండవ వేవ్ మధ్య కాలంలో బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (ఎన్.బి.ఎఫ్.సి లు) వినియోగదారుల పరపతికి డిమాండ్ తగ్గింది.
*మహమ్మారి కారణంగా ఏర్పడిన గందరగోళం వల్ల బ్యాంకులు సాపేక్షంగా ప్రభావితం కావు మరియు బ్యాంకుల నియంత్రణ, ద్రవ్య మరియు ఆర్థిక విధానాల ద్వారా బ్యాంకుల బాగా రక్షించబడతాయి.
0 Comments