ది జెయింట్ ముంట్జాక్ (ముంతియాకస్ వుక్వాంజెన్సిస్) అనేది వియత్నాం మరియు మధ్య లావోస్ లో 1994 లో కనుగొనబడిన ముంట్జాక్ యొక్క అతిపెద్ద జాతి. ఇది సాధారణంగా సతతహరిత అడవులలో కనిపిస్తుంది. పోడు వ్యవసాయం మరియు వేట కారణంగా వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇది అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉంది.
జెయింట్ బార్కింగ్ డీర్ అని కూడా పిలువబడే ఇది ఇటీవల ఈశాన్య కంబోడియాలోని విరాచే నేషనల్ పార్క్ లోని హిడెన్ కెమెరా ద్వారా గుర్తించబడింది.కంబోడియన్ అధికారులు అడవిలొని కెమెరాను తిరిగి సేకరించి, నెలల తరబడి ఉన్న ఫుటేజీని దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే ఈ జంతువును కనుగొనడం జరిగింది, ఇది పెద్ద ఎత్తున అక్రమ కలప రవాణాతొ ప్రభావితమైంది.